పొట్టివాడైనా గట్టివాడు ఈ కూచిభొట్ల ఆనంద్ - మండలి బుద్ధప్రసాద్.
ఈయన ఆలోచనే ఈ లక్షగళార్చన!
దాదాపు అన్ని చానెళ్లూ లైవ్ ఇచ్చాయి కాబట్టి నేను వివరాల జోలికి పోవటం లేదు. నేను మాత్రమే చెప్పగలిగిన మాటలేమైనా ఉంటే రెండురోజుల తర్వాత పోస్ట్ చేస్తాను..
ఒక్కటి మాత్రం ఇప్పుడు చెప్తాను..
"మనకిప్పుడు తెలుగులో ఉన్న పదాలు యాభైవేలు మాత్రమే. కాని, అన్నమయ్య లక్ష పదాలను తన కీర్తనల్లో వాడాడు." - రచయిత భారవి.
ఈరోజు జరిగిన లక్ష గళార్చన గురించి చెప్పాలంటే మాత్రం.. నేను ఆ మిగిలిన యాభైవేల పదాలను కూడా నేర్చుకుంటే గాని, సరైన పదం తెలియదు.
ప్రస్తుతానికి నేను చెప్పేది మాత్రం..
ఇది అద్భుతం.. అమోఘం.. అనిర్వచనీయం.
న భూతో న సమీప భవిష్యతి!
6 comments:
ప్రపంచంలో పెద్దగా ఎవరు తుమ్మారు, దగ్గారు లాంటివి రికార్డు చేసే ఈ పుస్తకాన్ని మనోళ్లు తప్ప ఎవరూ పెద్దగా పట్టించుకోర్లెండి. వాళ్ల రికార్డు సంగతవతల పెడదాం. తెలుగులో యాభై వేల పదాలు మాత్రమే ఉన్నాయనెవరు చెప్పారు?
Dude Abracadabra
We do know you are one hell of a AAA Aweful Anti-Hindu Azzole. Why are you proving it time and again?
అబ్రకదబ్ర గారూ..
ఇందులో వరల్డ్ రికార్డును మనం పట్టించుకోలేకున్నా..
అంతమంది ఆంధ్రులు ఒక్కచోటికి చేరి ఒక్కగళమై ఆలపించటం మామూలు విషయం కాదు. వారు పాడిన ఆ సప్త సంకీర్తనలు ఎంత హృద్యంగా ఉన్నాయో విన్న వారికే గాని అన్యులకు అర్ధం కాదు.
తెలుగు భాషలో యాభైవేల పదాలు మాత్రమే ఉన్నాయని నాకు చెప్పిన వారు.. అన్నమయ్య కీర్తనలపై 20సంవత్సరాలు పరిశోధన చేసిన రచయిత శ్రీ భారవి గారు.
మిత్రులకు మనవి:
మన బ్లాగుని వివాదాలకు అతీతంగా ఉంచేందుకు సహకరించగలరు.
అన్నమయ్య పాటల్లో గొప్పదనం అదే. (చాలావరకూ) సంగీత జ్ఞానం లేనివాళ్లుకూడా పాడుకోగలిగేలా ఉండటం. అయితే నా బాధల్లా ఇలాంటి మెరమెచ్చు పనులతో అన్నమయ్య వాన్మయానికీ, సంగీతానికీ నిజంగా ఒరిగేదేంటని. రికార్డులకోసం పనులు చేసినోళ్లు నాలుగు రోజులు వార్తల్లో ఉంటారు ఆ తర్వాత జనం మర్చిపోతారు. అన్నమయ్యకి నిజమైన వారసులు వేరే ఉన్నారు. ఎవరో మీకు తెలుసు.
పదిహేనేళ్ల క్రితం సంగతిది. విజయవాడలో చదువుకుంటుండగా మూడేళ్లపాటు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. బాలమురళీకృష్ణ పుట్టినూరది. ఆ వూర్లో ఓ సంగీతం టీచర్ని పట్టుకోటానికి అష్టకష్టాలు పడాల్సొచ్చింది. తెల్లారుఝామున నాలుగ్గంటలకు లేచి సైకిలేసుకుని ఐదు కిలోమీటర్లెళ్లాల్సొచ్చేది. తర్వాత పై చదువులకి మద్రాస్ వెళ్లాను. అక్కడ - ఎక్కడ చూసినా సంగీత స్కూళ్లే. మద్రాస్ మహానగరానికీ, విజయవాడకీ పోలిక పెట్టటం కాదు కానీ, తెలుగోళ్లు తన్ని తరిమేసిన సంగీతాన్ని తమిళులెంత భద్రంగా కాపాడారో తలచుకుంటే అబ్బురమేస్తుంది. ఇప్పటికీ చూడండి, హైదరాబాదులో చెప్పుకోదగ్గ సంగీత కళాశాల ఒక్కటన్నా ఉందా? లక్షలమంది జనాలని సేకరించి రికార్డుల కోసం పాడించాలంటే ఎంత కష్టపడాలి? దానికి బదులు సంగీతానికి శాశ్వతంగా మేలుచేసే పనేదన్నా చెయ్యొచ్చుగదా.
ప్రతి తెలుగువాడి బాధ కుడా అదే అబ్రకదబ్ర గారూ..
ఏమో గతంలో మనం మరచిపోయిన వాటిని తిరిగి జనానికి చేరువ చేసే ప్రయత్నమే ఇంత అట్టహాసంగా చేయాల్సొంచ్చిందేమో!
ఈరోజు నాకు తెలిసిన వాళ్లు ముగ్గురు చెప్పారు.. మా పిల్లలకు అన్నమయ్య కీర్తనలు నేర్పించాలనుకుంటున్నాం.. అని.
మీరు అన్నదాంట్లో నిజం ఉందండీ.. హైదరాబాదులో కొంచెం మంచి సంగీత కళాశాల కనిపించలేదు.
ఏది ఏమైనా తెలుగువాడి గతమెంతో ఘనం. దాన్ని తలుచుకుంటూ జీవితం గడపకుండా మనం కూడా అంత గొప్పగా బతకాలన్నదే నా ఆశ.
దక్షిణాదిన సంగీతాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన తెలుగువారి లోగిళ్లలో ఈ నాడు దానికున్న ఆదరణ తలచుకుంటే ఆవేదన కలుగుతుంది. తెలుగోళ్లకి సంగీతమంటే అభిమానం లేదని కాదు. అయితే కొన్ని విషయాల్లో నిర్లిప్తత. పదిమంది తెలుగోళ్లని కర్నాటక సంగీత త్రిమూర్తులెవరని అడిగితే ఆ ముగ్గురి పేర్లూ చెప్పగలిగేవారెందరు? ప్రతి ఒక్కరూ సంగీత విద్వాంసులవనవసరం లేదు. మన సంస్కృతికి, చరిత్రకి సంబంధించిన కొన్ని ముఖ్య ఘట్టాలు, పేర్లు వగైరాలు అందరికీ తెలిసుండాలి కదా. పిల్లల బుర్రల్లో పదో క్లాసునుండీ ఎంసెట్, ఈసెట్, ఆసెట్ అంటూ కనపడ్డవన్నీ కూరే పెద్దోళ్లు ఇలాంటివి తెలియజెప్పటమ్మీద దృష్టి పెట్టరెందుకు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి