30, జనవరి 2009, శుక్రవారం

ఎవరైనా మాకొకటే..

రోడ్డు మీద నిలుచున్న
అమ్మాయిని కంటిచూపుతో
చంపేస్తాం మేము.

బస్సులో ఆంటీని
వంటి రాపిడితో
నలిపేస్తాం మేము.

వదినైనా, చెల్లైనా
మరొకరికి తల్లైనా..
ఆకలితో చూస్తాం మేము.

ఇంటర్నెట్టు,సెల్లు
మెసేజిలతో మిమ్మల్ని
భయపెట్టేస్తాం మేము.

ఆఫీసులో పక్కసీటు,
సినిమాహాల్లో వెనక సీటులో
మీకు నరకం చూపిస్తాం మేము.

ప్రేమ పేరుతో మీ
వెంటబడి త్వరగా
స్వర్గానికి పంపిస్తాం మేము.


మగవాళ్లని ఎందుకు కన్నాం
మేమని సిగ్గుతో మీరు
ఛస్తుంటే చూస్తుంటాం మేము.

మాకన్నా గజ్జికుక్కే
నయమని మీరంటే..
సిగ్గులేకుండా నవ్వుతాం మేము.