నిన్న నేను, నా ఫ్రెండ్సు ఐపీఎల్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక చిన్న వాదన జరిగింది.
ముంబై ఇండియన్స్ గొప్పా? దక్కన్ చార్జర్స్ గొప్పా? డేర్ డెవిల్స్ గొప్పా? లేక చెన్నై సూపర్ కింగ్స్ గొప్పా అని!
సచిన్ ఉన్నాడు కాబట్టి ముంబై ఇండియన్స్ గొప్పని ఒకడు..
మనది హైదరాబాదు కాబట్టి దక్కన్ చార్జర్స్ గొప్పని ఒకడు..
సుడిగాలి సెహ్వాగ్ ఉన్నాడు కాబట్టి డేర్ డెవిల్స్ గొప్పని ఒకడు..
ఇవేమీ కాదు.. ధనాధన్ ధోని ఉన్నాడు.. టీ20 కెప్టెన్ అతనే కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ గొప్పని ఒకడు వాదించుకున్నాం!
కాసేపటికి వాదన తీవ్రమయింది. వాడి గొప్పేంటంటే వాడి గొప్పేంటని అనుకున్నాం.
టీ తాగి, కాసేపు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచిస్తే అనిపించింది..
క్రికెట్ దేవుడు సచిన్ ఒకప్పుడు మన సొంత వాడు.
పాలపిడుగు ధోని.. యువతరం హీరో.. వాడు కూడా మన వాడే.
తుఫాను పుట్టించే సెహ్వాగుకి బట్టతల వచ్చినా.. మనతో అనుబంధం పోలేదు.
లక్ష్మణ్ అంటే ఆస్ట్రేలియా వాళ్లకి ఎంత భయమో చెప్పుకునేటప్పుడు.. గంగూలీ చొక్కా గాలిలో గిర్రున తిరిగిన క్షణాలు తలుచుకునేటప్పుడు కళ్లలో కనిపించే గర్వం.. ఇవన్నీ మాయమైపోయి.. వాళ్ల గొప్పదనాలు మసక బారిపోయాయి కదా.. అనుకున్నాం.
నిజమే కదా!
ఒకప్పుడు ఒక్కడు కూడా అవుటవకూడదని అనుకునే మనమే...
సచిన్ సెంచరీ చేయాలని.. వినాయకుడికి కొబ్బరికాయలు కొట్టిన మనమే..
సెహ్వాగ్ పెళ్లి కుదిరినప్పుడు.. మన ఇంట్లో వాడిదే పెళ్లని బిల్డప్ ఇచ్చిన మనమే..
ఎందుకిలా మారిపోయాం?
దానికీ ఒక సమాధానం వచ్చింది..
ఇంగ్లాండులో క్లబ్ క్రికెట్ ఉందికదా..
మన వాళ్లు కూడా అక్కడ అప్పుడప్పుడు ఆడిన వాళ్లే కదా..
ఐపీఎల్ కూడా అలాంటిదే.. నగరాల పేర్లున్నా.. ఇది కూడా క్లబ్ క్రికెట్ లాంటిదే.. లేకపోతే షారూఖ్ ఖాన్ కి కోల్ కతా తో సంబంధం ఏంటి?
వచ్చే నెల్లో టి20 వరల్డ్ కప్ ఉంది. అది మనమే తెచ్చుకోవాలంటే ఈమాత్రం పోటి ఉండాలిలే.. లేకపోతే, అసలు టచ్ లో లేకుండా పోతారు అని!
చర్చ మరోలా వాదనగా మారింది.
ఐపీఎల్ లీగ్ ఎలా ఉన్నా.. మన భారతీయులు నగరాల లెక్కలో విడిపోయినా.. సంతోష పడటానికి లలిత్ మోడి ఉన్నాడు. ఆటలో ప్రొఫెషనలిజం పెరిగి, బాగా ఆడే వాడే టీం లో ఉండే రోజు త్వరగా వస్తే.. అభిమానులు క్రికెటర్ల ఇళ్లపై దాడి చేయకుండా ఇంట్లో కూర్చుని చీరలుండని చీర్ లీడర్ల ఆటలు చూస్తారు.
ఒకవేళ ఎవరైనా దాడి చేసినా ఆక్రికెటర్ మన నగరం వాడు కాదులే అని మిగిలిన వాళ్లు లైట్ తీస్కుంటారు.
ఏమంటారు?
తాళి
12 సంవత్సరాల క్రితం
1 comments:
ఇంట్లో కూర్చుని చీరలుండని చీర్ లీడర్ల ఆటలు చూస్తారు.. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి