16, మే 2010, ఆదివారం

మనిషివా.. జర్నలిస్టువా??

నా మిత్రుడు వెంకట్ ఉక్రోషానికి.. ఆక్రోశానికి ఎగసిన తరంగాలు ఇక్కడ!

http://uttaratarangalu.blogspot.com/2010/04/blog-post_21.html


ఆ తరంగాలను చల్లార్చి, కలుపుకుని పోయిన నా వాహిని... (కామెంట్ రూపంలో అక్కడ కూడా ఉంది)
కొద్దిగా.. సరి చేసి.


కార్పొ'రేటు' కంపెనీలో ఉంటుంది ప్రతిపనికీ ఓ రేటు
ఒకడిని మంచి వాణ్ని చేయాలన్నా..
ఎందుకూ పనికిరాని వాడిగా చిత్రించాలన్నా..
ఆఫ్ట్రాల్.. మన చేతిలో పని.

నయా బూతు సామ్రాజ్యంలో..
'ఛీర్స్' లీడర్లం మనం
ఆఫీసు చీకటి గదుల్లో వలువలే ఉండవు
ఇక మనకు విలువలెక్కడ?

ఎవడైనా నోటుతో కొడితే చాలు..
అబ్బనీ తియ్యనీ దెబ్బ అంటూ..
అమ్మాయిల ఒడిలో మత్తుగా చిందేస్తాం.
ఆపై ముమైత్‌ఖాన్‌కి అశ్లీలతపై పాఠాలు చెప్తాం..

ప్రెస్‌ అని అచ్చోసి తిరిగేస్తాం
రూల్సంటే మనకి పట్టవు..
డాక్యుమెంట్సు అసలుండవు..
కానిస్టేబుల్ ఆపితే.. వాడి బాసుతో తిట్టిస్తాం.

ముచ్చటపడి ఎప్పుడైనా ముసుగు తీసి
మంచి చేయాలని ముందుకొస్తే..
'నీకెందుకొచ్చిన తీట?' అంటూ
తిట్టే మన బాసుల ముందు నవ్వుతూ చస్తాం.

డబ్బుకు.. అధికారానికి మధ్య
సరసాలకు సరదాలకు నడుమ
కంపులో బతికే పేడపురుగులం
బయట పడలేని.. శ్లేష్మంలో ఈగలం

ఎంతైనా మనం జర్నలిస్టులం!