7, ఏప్రిల్ 2009, మంగళవారం

దేవాంజలి

ఎవరవయ్యా నీవు?
నిద్రిస్తున్న వాడిని లేలెమ్మని పిలుస్తావు?
ఏమిటి, నీకూ నాకూ సంబంధం?
నిన్నెక్కడో చూశాను..
కరిగిపోతున్న కొవ్వొత్తి చివరి కాంతిరేఖలోనో..
కదలిపోతున్న పిల్లగాలి తెమ్మెరలోనో!
అవును. చూశాను. అయితే ఏమిటి?
నీవెవరో తెలియదే!?
దీపం ఆర్పి చీకటిలో పడుకున్న వాడిముందు
సూర్యతేజాన్ని నిలుపుతానంటావు?
నీకెందుకు చెప్పు?
కనులు మూసుకుని కలలు కనేవాణ్ని,
మనసు తెరచి కదలి రమ్మంటావు?
ఇదేమైనా న్యాయమా?
అయినా నువ్వు దిగులు చెందకు.
ఈ లోకం తీరే అంత.
దారి చూపుతాను రమ్మంటే...
'దారి ఖర్చులకెంత ఇస్తావు?' అని
అడుగుతారు.
సరే.. పద, పోదాం.
నీకూ, నాకూ ఈ లోకం
సరిపడదు గానీ!

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి