22, ఏప్రిల్ 2009, బుధవారం

ఆహా.. ఏమి స్టంటులే హలా!

ఇలాంటి స్టంటులెప్పుడైనా చూశారా?

13, ఏప్రిల్ 2009, సోమవారం

ఇలాంటి స్వాగతం మళ్లీ ఉంటుందా?

బెంగళూరులోని అదితి టెక్నాలజీస్ తన కొత్త ఉద్యోగులకు ఆఫీసులో ఇలా స్వాగతం పలికింది. కాకపోతే ఇది రెండు సంవత్సరాల కిందటి మాట. మరి ఇప్పుడున్న పరిస్ధితులలో ఏకంపెనీ అయినా ఇలా ఉద్యోగులను ఆహ్వానిస్తుందా? కనీసం అదితి టెక్నాలజీస్ అయినా?

11, ఏప్రిల్ 2009, శనివారం

మనకు ఇప్పుడు కావాల్సినదల్లా... ఛేంజ్!

మరి మీదగ్గర ఎంత ఉంది?



ఇది ఎవరినీ నొప్పించటానికి మాత్రం కాదు. జస్ట్ సరదాకి!

10, ఏప్రిల్ 2009, శుక్రవారం

జనగణమన.. జయహే!

ఈ వయసులో మీరెప్పుడైనా ఇంత చక్కగా పాడారా?

8, ఏప్రిల్ 2009, బుధవారం

మీకుక్కకు కలొచ్చిందా?

మీకెప్పుడైనా కలొచ్చిందా?
ఎక్కడికో నడుస్తూ వెళ్తున్నట్లూ..
ఎవరో వెంటపడితే పరిగెత్తుతున్నట్లూ.. అనిపించి
హటాత్తుగా మంచం మీదనుంచి కింద పడ్డారా ఎప్పుడైనా?

సరే.. మనుషులన్నాక కలలు రాకుండా ఉంటాయా?

మరి.. మీకుక్కకెప్పుడైనా కలొచ్చిందా?
కుక్కకు కలొస్తే మాకెలా చెప్తుందండీ అంటారా?
సరే.. అది చెప్పలేకపోతే మీరే చూడచ్చు కదా?
ఎలా అంటారా?

ఇదిగో ఈ కుక్కకు కలొచ్చింది.
ఏం కలొచ్చిందో ఈ వీడియో చూస్తే మీకుకూడా తెలుస్తుంది.

7, ఏప్రిల్ 2009, మంగళవారం

దేవాంజలి

ఎవరవయ్యా నీవు?
నిద్రిస్తున్న వాడిని లేలెమ్మని పిలుస్తావు?
ఏమిటి, నీకూ నాకూ సంబంధం?
నిన్నెక్కడో చూశాను..
కరిగిపోతున్న కొవ్వొత్తి చివరి కాంతిరేఖలోనో..
కదలిపోతున్న పిల్లగాలి తెమ్మెరలోనో!
అవును. చూశాను. అయితే ఏమిటి?
నీవెవరో తెలియదే!?
దీపం ఆర్పి చీకటిలో పడుకున్న వాడిముందు
సూర్యతేజాన్ని నిలుపుతానంటావు?
నీకెందుకు చెప్పు?
కనులు మూసుకుని కలలు కనేవాణ్ని,
మనసు తెరచి కదలి రమ్మంటావు?
ఇదేమైనా న్యాయమా?
అయినా నువ్వు దిగులు చెందకు.
ఈ లోకం తీరే అంత.
దారి చూపుతాను రమ్మంటే...
'దారి ఖర్చులకెంత ఇస్తావు?' అని
అడుగుతారు.
సరే.. పద, పోదాం.
నీకూ, నాకూ ఈ లోకం
సరిపడదు గానీ!

6, ఏప్రిల్ 2009, సోమవారం

కోతి ఆట చూసొద్దాం!

అనగనగా ఒక కోతి.
ఆకలేస్తే అన్నం తిన్నదో లేదో తెలియదు..
ఖాళీగా ఉందని కల్లుతాగిందేమో కూడా తెలియదు.
చెట్టుకింద కూచున్న పులులని చూసి మాత్రం సరదా పడింది.
ఆటాడుకుందాం రమ్మని పిలిచింది.
మళ్లీ మళ్లీ పిలుస్తూనే ఉంది.
తను ఆడుకుంటూనే.. పులులని ఆటాడిస్తూనే..!
రండి. కోతి ఆట చూసొద్దాం!



తెలియక రౌడీరాజ్యంలోకి వెళ్తే..కోతి తగులుకుంది మరి!

5, ఏప్రిల్ 2009, ఆదివారం

స్త్రీ

ఒక స్త్రీలో రెండు పర్వతాలుంటాయి.
ఆ రెండు పర్వతాలలో
ఒకటి మంచు పర్వతం..
మరొకటి అగ్ని పర్వతం.
ఏ స్త్రీ అయినా ఒక పురుషుడిని
మనఃపూర్తిగా నమ్మి, అర్పించుకున్నప్పుడు
మంచు పర్వతం కరిగిపోతుంది.
కరిగి, కౌగిలిలో ఒదిగిపోయిన స్త్రీ..
ఆ పురుషుడిని అనురాగ జలంతో అభిషేకిస్తుంది.
కానీ,
అదే స్త్రీ, తను నమ్మిన వాడు తనను మోసం
చేశాడని తెలుసుకున్న మరుక్షణం
అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఆ కోపాగ్ని
జ్వాలలతో అతన్ని దహించి వెస్తుంది.
వినాశనం సృష్టిస్తుంది.
ఆ లావాను చల్లార్చేందుకు స్త్రీ మనసులో
మంచు మిగిలి ఉండదు. మిగిలింది కన్నీరే.
ఆ ఉప్పునీటికి అగ్ని జ్వాలలు మరింత
భయంకరంగా ప్రజ్వరిల్లుతాయి.

ఇసుక కళ