30, జనవరి 2009, శుక్రవారం

ఎవరైనా మాకొకటే..

రోడ్డు మీద నిలుచున్న
అమ్మాయిని కంటిచూపుతో
చంపేస్తాం మేము.

బస్సులో ఆంటీని
వంటి రాపిడితో
నలిపేస్తాం మేము.

వదినైనా, చెల్లైనా
మరొకరికి తల్లైనా..
ఆకలితో చూస్తాం మేము.

ఇంటర్నెట్టు,సెల్లు
మెసేజిలతో మిమ్మల్ని
భయపెట్టేస్తాం మేము.

ఆఫీసులో పక్కసీటు,
సినిమాహాల్లో వెనక సీటులో
మీకు నరకం చూపిస్తాం మేము.

ప్రేమ పేరుతో మీ
వెంటబడి త్వరగా
స్వర్గానికి పంపిస్తాం మేము.


మగవాళ్లని ఎందుకు కన్నాం
మేమని సిగ్గుతో మీరు
ఛస్తుంటే చూస్తుంటాం మేము.

మాకన్నా గజ్జికుక్కే
నయమని మీరంటే..
సిగ్గులేకుండా నవ్వుతాం మేము.

3 comments:

అజ్ఞాత చెప్పారు...

baga rasarandi..
andhra mottam ekkada vinna ammayila meeda attacks gurinche news.
government em chestundo mari?

Sky చెప్పారు...

నరేష్ గారు,
ముందే తెలుసు నాకు మీ ప్రతీ టపాకి వ్యాఖ్య రాయవలసి వస్తుంది అని. ఎప్పుడో తప్ప ఎప్పుడూ ఎందుకు రాయరు అన్నది నేను ఎప్పుడూ అడిగే ప్రశ్నే అయినా ఈ సారి మాత్రం జవాబు చెప్పండి.

ప్రస్తుత పరిస్థితులకు చక్కటి అక్షర రూపం ఇచ్చారు. మగపిల్లలను ఎందుకుకన్నామా అని తల్లి కూడా అనుకునే రోజు ఎంతో దూరంలో లేదేమో! ఇదివరకు ఆడపిల్లలు పుడితే పురిటిలోనే చంపడమో లేక చెత్తకుప్పల్లో పారేయటమో జరిగేది-- కాలచక్రం తిరిగి ఈసారి ఆ పరిస్థితులను మగవారు ఎదుర్కోవాలేమో!!!
దయచేసి మీరు వీలయినంత ఎక్కువగా రాయండి.

ఎప్పుడూ మిమ్మల్ని, మీ రాతల్నీ అభిమానించే
-సతీష్ కుమార్ యనమండ్ర

అజ్ఞాత చెప్పారు...

bagundi anna..

కామెంట్‌ను పోస్ట్ చేయండి