ఆ వీర స్వర్గంలో
మన కార్గిల్ వీరులు కనిపిస్తే
చెప్పండి, ఈ కుర్చీలలో
ఎవరు కూర్చున్నా ఒకటేనని,
దేశభద్రత గాల్లో దీపమేనని.
భూతల స్వర్గంకోసం
జరిగే దాయాదుల పోరులో
మరణించిన సైనికుల
శవపేఠికల సొమ్ముతినే
రాబందుల దేశమిదని.
అధికారం చాలు మాకు
బాధ్యతలక్కర లేదు,
కుర్చీలకై పాకులాటలో
క్షణం తీరిక లేదు,
ప్రజల రక్షణకేమీ చేయలేమని.
గుడ్డి నిఘా వ్యవస్ధకు తోడు
చట్టం కుంటిదయింది.
న్యాయం మూగబోయింది.
మీ శౌర్యం, మీ ప్రతాపం స్కూలు
పిల్లల పాఠాలుగ మిగిలాయని.
మరో జన్మంటూ మీకుంటే
మీ ఈ దేశానికే రావాలని..
సైనికులుగా కాదు, నిజాయితీ
క్రమశిక్షణతో దేశదిశను మార్చే
నాయకులుగా రమ్మని.
తాళి
12 సంవత్సరాల క్రితం
2 comments:
నరేష్ గారికి,
చాలా అద్భుతంగా రాసారు. పదాల పొందిక, భావ ప్రకటన చాలా బాగుంది. మీ శైలి నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడో, ఎక్కడో చదివిన ఒక వ్యాసం లోని మాటల తూటాలు గుర్తుకు వచ్చాయి. వాటిని మీతోనూ మరియూ మీ బ్లాగ్ సందర్శకులతో పంచుకుందాం అనుకుని:
"ఎందరో మహానుభావుల కలల పంటలు, మరెందరో అమరవీరుల త్యాగఫలాలు. అదే భారతావని స్వతంత్ర దినోత్సవం, సకల మానవాళి సంబరాల సమారోహోత్సవం. ఆరుపదేళ్ళ జీవనయానంలో ఎన్నో మజిలీలు, మలుపులు, సంచలనాలు, సంకలనాలు, కష్టాలు, నష్టాలు, చిరునవ్వుల ప్రక్కనే కల్లోలనాదాలు, కల్లబొల్లి నినాదాలు, ఆనందం, విషాదం చెట్టపట్టాలేసుకుంటున్న ప్రయాణం. మారేవి మారుతున్నాయి, మారని రూపాలు, రూపాయిలూ దర్శనం అవుతున్నాయి. రూపుమారుతున్నట్లు కనిపించే పల్లెలు, పరుగెడుతూ, అలసి సొలసిపోయి చతికిలబడుతున్న పట్టణాలు. అన్నిరంగాల్లోనూ దూసుకెళ్ళుతున్నాం, అగ్రరాజ్యాల్లో చేరిపోతున్నాం. అయినా - ఆకలి, కన్నీళ్ళు, సుళ్ళు, బాంబు పేలుళ్లు, రవంతే పరవళ్ళు .
ఏది ఏమైనా, అంబరం వైపు పయనం కావించే సమయం. అర్థవంతపు నేతలకీ, పాలనకీ నిరీక్షణం.
ఉవ్వెత్తున ఎగసిపోతున్న రాజకీయ రక్కసి గాలులు, 'చిరూగాలి శౄతిమించి 'అల్లూకుపోతున్న 'నాగాబంధ 'పవనావీచికలు. దుమ్ము, దుమారం, దురహంకారం, దురాశ, దుర్నీతి సంగమం.
ఓ భగవాన్! ప్రభూ! ప్రవక్తా!
నాదేశపు ప్రజని, భారతావనిని, కరుణించు, కటాక్షించు.
స్థితిగతుల్ని మార్చలేని స్తబ్ధతలో కనీసపు నిబ్బరాన్ని
అందించుమార్పు తేగలిగే స్థితుల్లో మార్పిడికి అవసరమైన ధైర్యాన్నివ్వు.
మన జాతికి మరో మహాసంకల్పం అందించడానికి, మరో మహాత్ముడు అవతరించాల్సిన తరుణం ఆసన్నమైంది."
వ్యంగ్యం, గా అయినా నర్మగర్భంగా చెప్పాల్సిన. విషయాలని ఎంతో, చక్కగా చెప్పారు. వీలు చూసుకుని మీరు కూడా నా బ్లాగ్ ని చూడండి. ఇక శలవ్.
భవదీయుడు,
సతీష్ కుమార్ యనమండ్ర
సోదరులు నరేష్ గారికి,
ఆత్మీయంగా మీరు అందజేసిన అభినందనలకు ధన్యవాదములు. మీ profile లో చూసాను మీరు reporter అని. అర్ధం చేసుకోగలను మీరు ఎంత busy గా వుంటారో. అంతటి పని వత్తిడులలో కూడా కాస్త సమయాన్ని వెచ్చించి నా బ్లాగ్ ని చూసినందుకు, మనఃస్పూర్తిగా నాలుగు మాటలు రాసినందుకు ధన్యుడిని.
నేను బ్లాగ్ మొదలుపెట్టడానికి కారణం మనసులో మెదిలే భావాలను అక్షరీకరించాలని, కానీ ఎందరో మహానుభావులని ముందుతరాలకి తెలియచేయాలి అన్న ఆలోచన ఈ బ్లాగ్ కి పురిగొల్పింది. మన దేశ సంస్కృతీ, సంప్రదాయాల ఔన్నత్యం, మన పూర్వుల ఘన కీర్తి, వారి విశిష్ట సేవలు అందరికీ తెలియపరచాలి అనుకున్నా. మొదట్లో చాలా నిరాస ఎదురయింది, పాత చింతకాయ పచ్చడి లా వుంది అని చాలా మంది పెదవి విరిచారు(దాని రుచి వారికేం తెలుసు అని మౌనంగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళా). Ever since I've started writing in Telugu, I am enjoying the sweetness of our language- Being a Voice and Accent Trainer in English, I love to converse in Telugu--- idi mari pichho verro teliyadu :)
మీ బ్లాగ్ ని పూర్తిగా చదివేసాను. భావాలను అక్షరీకరించడం ఒక కళ, దానికి మీ నేర్పు తోడై మరిన్ని విషయాలను రాయాలని కోరుకుంటున్నాను. మీ బ్లాగ్ లోని విషయాలు సమాజం పై మీ భాద్యతని తెలియపరుస్తున్నాయి. ఆపకండి- ఆపి మమ్మల్ని నిరుత్సాహపరచకండి.
ఇక పోతే త్వరలో మరిన్ని విషయాలపై రాయబోతున్నాను- మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ పుస్తకం నుండి తెలుగు జాతికి గర్వకారణమైన ప్రతి ఒక్కరిపై రాయాలని ఆశ!!! చూద్దాం ఎంతవరకు సఫలం అవుతానో.
మిమ్మల్ని Google Talk లో add చేసుకున్నాను.... మీకు అభ్యంతరం లేదు అనుకుంటా? నేను కూడా మిమ్మల్ని follow అవుతున్నా ( అలా అని నా మీద కంప్లైంట్ ఇవ్వకండి :)
ప్రస్తుతానికి శలవ్.
భవదీయుడు
సతీష్ యనమండ్ర
కామెంట్‌ను పోస్ట్ చేయండి