ఒక ముందు మాట నేస్తం.. ఈ టపాని చూసి నవ్వుకోండి కాని.. దయచేసి నన్ను చూసి నవ్వద్దు..

ఇక అసలు విషయానికి వస్తే...

మొన్నామధ్య, నా ప్రేయసికి మళ్ళీ కోపం వచ్చింది. ఏం చేస్తాం, కోపాలేమో వాళ్ళకు.. తాపాలేమో మనకు కదా..
అప్పుడు విషయం మార్చటానికి, నా తెలివిని తీసుకెల్లి కలగలుపు యంత్రం (అదేనండి.. వంటింట్లో వుంటుందీ.. మిక్సీ) లో వేసి తిప్పీ తిప్పీ చివరికి ఈ చిన్ని కధ చెప్పా.. (కధ మాత్రమే!!)..

వర్షం ఎలా పడుతుంది??

ఒకప్పుడు, తెల్ల రంగుకి చాలా గర్వం వచ్చింది.
మిగిలిన రంగులని చూసి, నవ్వుతూ అంది కదా..
"నేను అన్ని రంగులకి అమ్మని, అమ్మమ్మనీ.. నేను లేనిదే ఏ రంగు లేదు. దేవుడికి కూడా నేనంటేనే ఇష్టం. అందుకే తెల్ల రంగు బట్టలనే వేసుకుంటాడు. నేనే రంగులన్నింటికీ రాజుని." అంది. అంతేనా, పాపం కొన్ని రంగులని మరీమరీ ఏడిపించింది. మరి రంగుల్లో కూడ సున్నిత మనస్సున్న రంగులు ఉంటాయి కదా.. అవి తట్టుకోలేక ఆత్మ త్యాగం చేసుకుంటూ నల్ల రంగుకి ప్రాణం పొశాయి. తర్వాత కొన్నాళ్ళకి నల్ల రంగుకి జన్మ రహస్యం తెలిసి తెల్ల రంగుపై యుద్ధం ప్రకటించింది.
యుద్ధంలో నల్ల రంగు తెల్ల రంగుతో అంది కదా..
"నేను అన్ని రంగులని నాశనం చేసేంత శక్తి ఉన్న దానిని. నాతో పెట్టుకోకు.. నేను ఆక్రమిస్తే ఏ రంగు కూడా మిగలదు..నువ్వు రంగులకి రాజువి ఐతే నేను రంగుల చక్రవర్తిని.. జాగ్రత్త" అని తెల్ల రంగు వెంట పడింది. తెల్ల రంగుకి భయం వేసి ఆకాశంలోకి పరుగెత్తి మేఘాల్లో దాక్కుంది. దాని వెంట నల్ల రంగు కూడా పడింది. మేఘాల్లో ఇద్దరి మధ్య యుద్ధం జరిగి చివరికి తెల్ల రంగు ఏడుస్తూ వర్షంలా కిందకి పడిపోయింది.

నల్ల రంగు మేఘాల్లోంచి వెళ్ళిపోగానే, మళ్ళీ మేఘాల్లోకి వెల్లేది తెల్ల రంగు.

అదిగో అలా వర్షం పుట్టింది.

నల్ల రంగు తెల్ల రంగుని ఆక్రమిస్తే వర్షం పడుతుంది.
అంతే కదా.. తెల్లగా ఉన్న మేఘాలు నల్లగా మారితేనే కదా.. వర్షం పడేది?
ఆ రెండు రంగుల మధ్య జరిగే యుద్ధం కి గుర్తే ఉరుములూ, మెరుపులూ మరియు పిడుగులూనూ..

బాగా చెప్పానా??

7 వ్యాఖ్యలు:

oremuna చెప్పారు... August 7, 2007 2:46 PM  

బాగుంది

ఎంత సృజనాత్మకత

అభినందనలు.
మీ మిక్సీ చాలా బాగా పని చేస్తోంది. అలాగే పని చేయిస్తూ వుండండి.

nice post

mari aa rangulanni kalisi harivillu (indra dhanussu) erpadutundi kada ....ido kuda add cheyandi kathaku baguntundi

radhika చెప్పారు... August 9, 2007 4:06 AM  

మిమ్మలిని చూసి నవ్వడానికి ఏముందండి.కధ నిజం గా బాగా చెప్పారు.

Nagaraja చెప్పారు... August 22, 2007 3:52 AM  

నిజంగా అదిరింది.

sarada చెప్పారు... November 8, 2008 4:51 PM  

chaala baagundi ,intaki mee priyuralini meeru baaga samudainchagalananu ani cheppara?vaana gurunchi cheppara?rangula vaana gurunchi cheppara?na doubtlaku antamundadu kaani mottaniki chaala baaga rasarandi!

అంతర్వాహిని

మనోఫలకంపై ఒదిగిన అక్షర బిందువులు కాలపు అలజడికి, కలల ఒరిపిడికి గురై.. అప్పుడప్పుడూ చెప్పే భావాలకు అక్షరరూపం.. ఈ అంతర్వాహిని.

నేనెవరో?

నా చిహ్నము

నా చిహ్నము

అతిథి దేవోభవ!

తాజా వ్యాఖ్యలు

గతంలో వ్రాసినవి

నాకిష్టం

  • కలహాలు కూడా కమ్మగానే ఉంటాయి మరి - కలహాలు కమ్మగా ఉండటం ఏంటనుకుంటున్నారా,మరదే..పెళ్ళి అయిన కొత్తలో మొదటి కలహం ఒకసారి గుర్తు తెచ్చుకోండి..పెదవులపై చిరుధరహాసం వచ్చేస్తుంది చూసుకోండి.. ఆ తరువా...
    1 వారం క్రితం
  • - అమ్మయీ హత్య ,అత్యాచారం ఏదైనా జరిగినప్పుడు మహిళా అధ్యక్షురాళ్ళు ముందుంటారు మేము కఠినంగా శిక్షిస్తాం,శిక్ష పడేలా చేస్తాం అని గొంతు చించుకొని మరీ చెప్తుంటారు ...
    3 వారాల క్రితం
  • గోదావరి -
    4 వారాల క్రితం

నా ఆప్తులు