18, జూన్ 2010, శుక్రవారం

ఆత్మ'హత్య'

గుట్టలు గుట్టలుగా
శవాల కుప్పలు

తల లేని మొండెం
ఆత్రంగా తడుముకుంటోంది

ఆగిపోయిన శ్వాస
నిశ్శబ్ధంగా ఆవిరవుతోంది

మూతబడిన కనులు
రెప్పల్లోంచి చూస్తున్నాయి

తెరుచుకున్న నోరు
కొత్త వేదం పలుకుతోంది

తెగిపడిన చేయి
గుండె కోసం వెదుకుతోంది

రాబందుల రెక్కలతో
కాళ్లు ఎగురుతున్నాయి

చుట్టూవాలిన ఈగలు
మౌనగీతం పాడుతున్నాయి

దూరంగా నేను
మౌనంగా చూస్తున్నాను

ఆత్మను చంపి
అంత్యక్రియలు చేస్తున్నాను

1 comments:

SriChaman చెప్పారు...

నరేష్ గారూ ..ఆత్మ హత్య ..అక్షరాల్లో జీవించింది ..
చావు లేదు ... శీర్షిక తో నేను వేసిన పోస్ట్ నా బ్లాగ్ లో ఒక సారి చూడండి

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి