8, మార్చి 2010, సోమవారం

వీళ్లూ మనుషులే!

వాళ్లని చూస్తే భయం..
వాళ్లంటే కోపం..
అవకాశం వస్తే వాళ్లపైకి దాడికి దిగుతాం!
రాళ్లూ కర్రలతో వెంటపడి తరుముతాం!!

మరి వాళ్లు ఊరుకుంటారా?
మనకి దొరికినట్లే వాళ్లకు కూడా అవకాశం దొరుకుతుంది కదా!?

వాళ్లు ఉన్నన్నాళ్లూ మనం ఎవరి మాటా వినం..
మనం మాట విననన్నాళ్లు వాళ్లూ వెళ్లరు..

ఇదిగో ఇలా..



ఆర్నెళ్లుగా ఇంటిని,
కట్టుకున్న పెళ్లాన్నీ, కన్నబిడ్డలనీ వదిలి
గాలికి, ధూళికి ఫుట్‌పాత్‌పై సేద తీరుతుంటారు..
శరీరాన్ని చలికి అప్పగిస్తారు!

5 comments:

Anandakiran చెప్పారు...

vaalla oka konaanni baganae rasaaru

అజ్ఞాత చెప్పారు...

పోలీసులే అలా శ్రమించకపోయినట్టైతే ఈ పాటికి ఏ మావోల తుపాకి గొట్టాల కింద చచ్చిపడి వుండేవాళ్ళం. రాష్ట్ర విచ్చిన్నకర ముష్కరులకు సరైన 'న్యాయం' చేయాల్సింది వాళ్ళే...
వాళ్ళకు నా వీర సలాం.

శంకర్

Sravya V చెప్పారు...

చాలా బాగా వ్రాసారు . కొన్ని సార్లు వీళ్ళ పరిస్తితి చాల దారుణం గా ఉంటుంది అసెంబ్లీ సెషన్స్ కని
వచ్చిన వాళ్ళు వినాయక చవితి వరకు పెళ్ళాం పిల్లల్ని వదిలి 6 , 7 నెలల పాటు కూడా ఇలా కనీస సౌకర్యాలు కూడా లేకుండా డ్యూటీ చేసేవాళ్ళని నేను చూసాను వీళ్ళకు నా సాల్యూట్ !

మంచు చెప్పారు...

బాగా రాసారండి.. ప్రతీ విషయానీకి పొలీసు జులుం అని గొంతుచించుకునే వాగే వాళ్ళకి ఇవి చూపించాలి.. కొన్ని చోట్ల వాళ్ళ ప్రవర్తన కొంచెం అదుపుతప్పినా అది ఎంత వత్తిడిలొ జరిగిందొ అలొచించాలి.. పైన అజ్ఞాత లా వారిని నా సలాం కూడా

Sky చెప్పారు...

కొందరి దృష్టిలో వీరు మావలు,మరి కొందరికి బాబాయ్‍లు, ఇంకొందరికి రాక్షసులు- కానీ వారు మనుషులు.

వీళ్ళు కూడా మనలాగే మనుషులు అన్న సంగతి మనందరం ఎప్పుడో మరిచాం..... ఆ సంగతి వారు కూడా పాపం మరిచారేమో!

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పహారా కాస్తున్న పోలీస్ సోదరుల విషయం మీరు నాకు చెప్పిన మరునాడు పనికట్టుకుని మరీ వెళ్ళీ చూసి వచ్చాను- నిజంగా జాలేసింది వారిని చూసి.అప్పుడే వాళ్ళను నేను కూడా సాటి మనిషిగా భావించటం మొదలెట్టాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి