16, ఏప్రిల్ 2008, బుధవారం

వేశ్య అంటే..

వందకో, యాభైకో తనను
తాను అమ్ముకుని,
రాక్షస రతిలో భాగం పంచుకుని
చిత్ర హింసలను భరించి
సిగరెట్ వాతలు,
గోళ్ళ గుర్తులు, పంటి గాట్లతో
శరీరాన్ని ముక్కలు ముక్కలుగా
చించుకుని, కుంచించుకుపోయే
ఓ ప్రాణమున్న వస్తువు.

కట్టుకున్నవాడు చెంతలేనప్పుడు,
కన్న బిడ్డల ఆకలి కేకల కంటే
పక్క మగాళ్ల ఆశల చూపులు ఎక్కువయి
ఒకానొక బలహీన, బలాత్కార
సమయంలో, తన తప్పు లేకపోయినా
తలొంచుకు నిలబడి
కుంగి, కృశించి పోయే
ఓ అభాగ్య అనాధ.

చుట్టూ ఉన్న సమాజం
నువ్వు పతితవని, చెడ పుట్టావని
తిట్టిపోస్తుంటే.. దించిన తల పైకెత్తి
వారందరి ముఖాన ఉమ్మేసి,
మీకు చేవ ఉంటే, చేతనయితే
మీ ఇల్లు సరి చేసుకోండి.
మీ మగాళ్ళు ఇల్లు కదలకుండా
కొంగున కట్టివేసుకోండంటూ చెప్పే
ఓ వీర పతిత.

ఒక్క రోజులో
ఎందరికో తనను తాను పంచుకుని,
వచ్చిన ప్రతి ఒక్కరినీ
సంతృప్తుల్ని చేసి,
కొత్త వారికి మెళకువలు నేర్పుతూ
అనుభవాలను అలవాటుగా
మార్చుకున్న
ఓ త్యాగమయి.

కానీ,
వేశ్య అంటే..
ఆ వస్తువు, అనాధ, పతిత,
త్యాగమయి కాదు.

భాగస్వామిని మోసం చేయాలని
చూసే ప్రతి ఒక్కరూ వేశ్యలే.
వీరు దొరికితేనే వేశ్యలు.
అప్పటివరకూ
పతివ్రతలు.. లేదా పత్నీవ్రతులు.

6 comments:

krishna rao jallipalli చెప్పారు...

.... మరియు పోలిసోళ్ళను, బ్రోకర్లను, లాడ్జి వోనర్లను పోషించే ఒక యంత్రం కూడాను.

బుసాని పృథ్వీరాజు వర్మ చెప్పారు...

అందరికీ అన్నీవుంటాయి. మరి ఆడవారిని అలా అనడం దేనికి? మగవారు సరిగా లేకుంటే ఆ నింద వారిదా? మరి వీరినేమనాలో? అంటుంన్నానై కాదు, అన్నింటికీ ఆడవారు ఎందుకయ్యారో? కథలలో, కవితలలో, కయ్యాలలొ,కాలంలో కనిపించే ప్రతి విషయం లో..ఎమో..మీ కథాంశానికి కృతజ్ఞతలు..
www.pruthviart.blogspot.com

rksistu చెప్పారు...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

sarada చెప్పారు...

hi,
Than q so much for your comment in my blog and u so well written about vesya.Some people are psychologically keeping another person picture in mind and doing romance or sex with their partners.those are also prrostitutes including male.isn'tit?
sarada.

tj చెప్పారు...

Me kavitha chala bagundi.
okkasariga kallu chemmagillayi mana samajanni talachukuni,
kani edi chesina vallaki vaallu konni policies pettukuni kattubadi vunte baguntundi. Adi mana tho ne start cheddama? Meru kuda start chestarani aasistunna....

అజ్ఞాత చెప్పారు...

Patitaga maarina aadadanni choosi magavaadu aasapadi tana aakali teerchukuni aameku dabbu istaadu, kaani... tappu chesina aadadhhanni chooste chaalamandi aadavaallaki asooya - dveshaalu kaligi, aamelaaga manam sradaalu cheyyalekapotunnamane baadato aameni maatalato himsisistaaru, aame vesya anna vishayaanni theliyani vaallaku kooda telisetattu chestaaru. Antey.... aadadaaniki aadade garbha satruvu.

Murthy

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి