9, ఏప్రిల్ 2008, బుధవారం

విలేఖరి

విలేఖరిని నేను.
పత్రికలో రేడియోలో టీవీలో
మీ అందరినీ పలకరించే
మీవాడినీ, మీలో ఒకడినీ నేను.

నా కళ్ళతో మీకు చూపిస్తాను
నా చెవులతో వినిపిస్తాను
ప్రపంచాన్ని మీ ముందుకు తెచ్చే పనిలో
మైళ్ళ దూరం పరిగెడుతాను నేను.

తుపాకీ గుళ్ళు, నెత్తుటి మరకలు
ఆర్తనాదాల మధ్య అడుగులు వేస్తూ
నిజాన్ని మాత్రమే భుజానమోసే
విక్రమార్కుడిని నేను.

అన్యాయానికి, అథర్మానికీ
ఎదురు నిలిచే క్రమంలో
బెదిరింపులు సైతం కలం కత్తితో
ఎదుర్కొంటున్న మనిషిని నేను.

విలేఖరిని నేను.
మీ వాడినీ, మీలో ఒకడినీ నేను.

1 comments:

అజ్ఞాత చెప్పారు...

bagundi

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి