మీరు ఊయలలో పడుకుని ఎన్ని సంవత్సరాలయింది? అదీ చిన్నప్పుడు అమ్మ చీరలో పడుకుని?
ఈ మితృడెవరో కానీ రెండు వారాల క్రితం నేను వైజాగ్ వెళ్తున్నప్పుడు హౌరా మెయిల్ లో నా కంట పడ్డాడు. అసలే జనరల్ కంపార్ట్మెంట్.. ఆపై ఫుల్ రష్. నుంచోటానికి కూడా ప్లేస్ లేని చోట మహానుభావుడు పడకసీను వేసాడు.. ఒక చిన్న టవల్ లో. ఆ కంపార్ట్ మెంట్ 4+1 టైపు. అటుఇటు లగేజి పెట్టుకునే వాటికి మధ్య ఫ్యాను కింద హాయిగా నిద్ర పోతున్న అతనిని చూసి ఫోటో తీయకుండా ఉండలేకపోయాను. ఉన్నదానితో సరిపెట్టుకునే వారికి ఇతను చక్కని ప్రతినిధిలా కనిపిస్తున్నాడు కదూ..
కొసమెరుపేంటంటే.. "అతని టవల్ ఎక్కడ ఊడిపోతుందో.. మీద ఎక్కడ పడతాడో అని" కిందవాళ్లకి ఒకటే టెన్షన్!
తాళి
12 సంవత్సరాల క్రితం
1 comments:
ఏంచేస్తాం మరి నిద్రాదేవిని ఎంతసేపు ఆపగలం.కష్టంలోనే సుఖాన్ని వెదుక్కున్నాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి