ఆరేళ్ళ క్రితం నేను చేసిన ఒక ఇంటర్వ్యూ నా జీవితాన్నే మార్చేసింది.
It took me, two days to find time to type in telugu. Actually, this was the post i wished to post from the very starting of this blog. But now, after a long time, i got the chance and courage to post it. This was the story of two women who were betrayed by their men, cheated and brutally harassed. They are now alive some where in Mumbai, the comman destination of the women who destined to take the path.
After seeing the blog of a New Friend, i got the courage and seen the necessity of telling the lives of Two Sex Workers. They are Strange but full of Pain.
(Names and Places are Changed.)
అవి నేను ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న రోజులు.
ఒక లోకల్ ఛానల్ కోసం సెక్స్ వర్కర్స్ ఇంటర్వ్యూ చేయటానికి వెళ్ళాను. నేను,మా కెమేరామాన్ ఇద్దరం వేరే ఊర్లోని మునిసిపల్ పార్క్ లో వెయిట్ చేస్తున్నాము. మా కెమేరామాన్ అప్పటికే ఇద్దరు వర్కర్స్ ని మాట్లాడి ఉంచాడు. పది నిముషాల తర్వాత వాళ్ళు వచ్చారు. వీణ(35), స్వాతి(32) వాళ్ల పేర్లు. మేకప్ కొంచెం ఎక్కువ అయిందనిపించింది వాళ్ళని చూడగానే. నలుగురం కలిసి లోకల్ కౌన్సిలర్ ఇంటికి వెళ్ళాము. ఆయన తెలిసిన వాడవటంతో వాళ్లింటికి తీసుకురావటానికి ఒప్పుకున్నాడు. గదిలో నలుగురిని వదిలేసి ఆయన బయటకు వెళ్లిపోయాడు. వాళ్ల ఆవిడ ఇంట్లో లేకపోవటం మా అదృష్టం.
ఇంటర్వ్యూ ఇలా సాగింది..
నేను : హాయ్, ఎలా ఉన్నారు?
వీణ : బాగానే ఉన్నాంగా, కనిపించటంలా?
నేను : (మనసులో.. ఎందుకుండరు? బాగా అలవాటయింది డబ్బులు ఈజీగా సంపాదించటం) మీ గురించి చెప్తారా?
స్వాతి : ఏంచెప్పాలి నీకు మా గురించి? సైజులా, మా దగ్గరకు వచ్చేవాళ్ల మాటలా??
నేను : మీ వృత్తి గురించి చెప్పండి.
స్వాతి : నువ్వేమనుకుంటున్నావ్ మా గురించి?
నేను : ఏమీ అనుకోవటం లేదు. ఏముంది అనుకోవటానికి?
వీణ : ఏమీ లేదనేవాడివి ఇంటర్వ్యూ చేయటానికెందుకు వచ్చావ్?
స్వాతి : పక్కా లం*లు అనుకుంటున్నావ్ కదా మా గురించి? పర్లేదు చెప్పు. మాకేమీ కొత్త కాదులే.
నేను : అదేం కాదు. సరే, అసలు మీ జీవితం ఎలా ఉంటుంది? పొద్దున్న లేచిన దగ్గర్నుంచి పడుకునే దాకా ఏంచేస్తారో చెప్పండి.
వీణ : రోజులో చాలా సార్లు మేం పడుకుంటాం.
నేను : సారీ, రాత్రి నిద్రపోయేవరకు ఏంచేస్తారు?
స్వాతి : (నవ్వుతూ..) ఏంచేస్తామో చెబితే చాలా? ఎలా చేస్తామో కూడా చూపించాలా?
నేను : చెబితే చాలు.
స్వాతి : ఏంచేసుకుంటావ్ చెప్పినతర్వాత?
వీణ : మమ్మల్ని ఏమీ లేకుండా చూడాలని మగాళ్లు కోరుకుంటారు. (నవ్వుతూ..) నీకు లేదా ఏంటి అలా?
నేను : (ఇబ్బందిగా) అదికాదు ఇక్కడ విషయం.
స్వాతి : మరి ఏది విషయం? (ఇద్దరూ నవ్వుతున్నారు)
మా కెమేరామాన్ వాళ్లకు సైగ చేస్తున్నాడు, ఊరుకోమని.
వాళ్ళేమో నవ్వుతున్నారు.
నాకు చిరాకొచ్చేసింది. ఇక లేచి నేను పోతున్నానని చెప్పేశాను మా కెమేరామాన్ కి.
స్వాతి : ఏంటి ఇంత దానికే కోపమైతే ఎలా? తర్వాత వచ్చేది చస్తుంది నీతో.
నేను : (కెమేరామాన్ వైపు చూసి) వస్తున్నావా రావటం లేదా?
వీణ : సరే సరే, కూర్చో. ఏం కావాలి చెప్పు నీకు?
స్వాతి : నువ్వు కావాలేమోనే...
వీణ : నోర్ముయ్యవే.. నువ్వు కూర్చో బాబూ..
నేను మళ్లీ ఛైర్లో కూర్చున్నాను.
మా కెమేరామాన్ "కొంచెం సీరియస్ గా చేద్దామా ఇంటర్వ్యూ?" అని అడిగాడు.
సరే అని అందరం తల ఊపాం.
నేను : అసలు మీరు ఈ బిజినెస్ లోకి ఎందుకు వచ్చారు?
స్వాతి : కావాలని ఐతే రాలేదు ఇందులోకి. మేమే కాదు ఏ ఆడది కూడా ఇందులోకి రావాలని కోరుకోదు.
నేను : కొంచెం అర్ధం అయ్యేలా చెప్తారా?
స్వాతి : మాది ఉయ్యూరు దగ్గర ఒక పల్లెటూరు. నాన్న చెఱకు రైతు. నేను రెండో అమ్మాయిని. నేను కాక ఇంకా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇంటర్ అయ్యేసరికి నాకు పదహారేళ్లే. బాగా చదివేదాన్ని తెలుసా? (ఆమె కళ్లలో ఒక మెఱుపు కనిపించింది.) తెలిసిన వాళ్ల ఇంట్లో పని చేయటానికి హైదరాబాదు పంపించారు నన్ను ఇంట్లో వాళ్లు. అక్కడ ఆ అక్కవాళ్లు కూడా నన్ను బాగానే చూసుకునేవాళ్లు. ప్రైవేటుగా నన్ను డిగ్రీ చేయమన్నారు కూడా. విజయవాడ అబ్బాయి ఒకడు వాళ్లింటి పక్కనే ఉండేవాడు. రోజు నవ్వేవాడు నన్ను చూసి. మొదట్లో పట్టించుకోలేదు. తర్వాత నేను కూడా నవ్వేదాన్ని. షాప్ కి వెళ్లినప్పుడు ఒకరోజు మాట్లాడాడు. నేనంటే ఇష్టమని చెప్పాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. నమ్మాను. అప్పుడప్పుడు బయట కలిసేవాడు. నిజంగా ఆరోజులు చాలా బాగుండేయి. జీవితంలో ఇంకేమీ అవసరంలేదనిపించేది. ఒకరోజు అక్క వాళ్లు లేనప్పుడు ఇంట్లొకొచ్చేశాడు. దగ్గరకు తీసుకుని ఏవేవో చేసేశాడు. అక్క వాళ్లు అదే సమయంలో రావటంతో ఇద్దరం దొరికిపోయాము. వాళ్లు నాన్నను పిలిపించి విషయం చెప్పి నన్ను ఇంటికి పంపేశారు. ఆరోజు నాన్న ఏమీ మాట్లాడలేదు. అక్క వాళ్లింటికి తీసుకెళ్లాదు. అమ్మ అక్కడే ఉంది. వెళ్లాక అమ్మ నన్ను కొట్టింది చూడూ.. జీవితంలో మర్చిపోలేను ఆ దెబ్బలు. బట్టలు మొత్తం చినిగిపోయాయి ఆ దెబ్బలకి. ఒళ్లంతా కందిపోయింది. వారం రోజులు స్నానం చేయలేదు. తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు బావ అన్నాడు. ఎవరు అతను? అని. నాకు తెలిసినవి చెప్పాను. సరే, నేను కనుక్కుంటాను అని చెప్పాడు. పది రోజుల తర్వాత అక్క బావ మా ఊరు వచ్చారు. ముగ్గురం కలిసి బందరు వచ్చాం. అక్కడ అతను కనిపించాడు. బావే అతన్ని రమ్మని చెప్పాడంట. పెళ్లి చేసుకుంటారా అని బావ అడిగాడు. అవునని చెప్పాం. ఐదు వేలు డబ్బులిచ్చి హైదరాబాదు పొమ్మని చెప్పాడు. ఇద్దరం హైదరాబదులో ఉన్నాం తెల్లారేసరికి. సనత్ నగర్ లో ఇల్లు తీసుకున్నాం. బావ ఇచ్చిన డబ్బుల్లో రెండు వేలు అడ్వాన్స్ గా ఇచ్చాం. అతను బాలానగర్ లో పనిచేసేవాడు. ఆరు వేలు జీతం అని చెప్పాడు. లైఫ్ బాగుంటుందనుకున్నాను. తర్వాత తెలిసింది అతనికి అన్ని అలవాట్లు ఉన్నాయని. సర్దిచెప్పుకున్నాను నాకు నేనే. రాత్రికి తాగి వచ్చి అన్నం తినక పొయినా పక్కలో మాత్రం నేనుండాల్సిందే. రెణ్నెళ్లలో నెల తప్పాను. విషయం ఆయనకి చెప్పి పెళ్లిచేసుకుందామని చెప్పా. సరే అన్నాడు. తర్వాత రోజు వేరే ప్లాంటుకి వెళ్లాలి. నాలుగు రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. వారం తర్వాత మా బావ, ఆయన కలిసి వచ్చారు. చాలా సంతోషం వేసింది అప్పుడు. పెళ్లికి వచ్చాడేమో బావ అని అనుకున్నాను. ఆరోజు ఇద్దరు బాగా తాగి వచ్చారు. ఓనర్స్ ఇంట్లో లేరు. ముగ్గురం చాపలేసుకుని లోపల పడుకున్నాం. సగం రాత్రిలో మీద చేయి పడితే ఆయనేమో అని అటు తిరిగా. చూస్తే బావ! గట్టిగా అదుముకుంటున్నాడు. నేను విదిలించుకునే లోపే నాచేతులు గట్టిగా పట్టుకున్నాడు ఆయన. ఏంజరుగుతుందో అర్ధం కాలేదు నాకు. ఇద్దరూ కలిసి నా చేతుల్ని టేబుల్ కి కట్టేశారు. అరవకుండా నోట్లో చీరకుక్కారు. బట్టలు మొత్తం ఊడదిసి ఒకడితర్వాత ఒకరు నన్ను అనుభవించారు. కొరికారు. సిగరెట్ తో కాల్చారు. చూడు ఇదే అది, నా జీవితంలో మొదటిది.. (తను ఒక్క సారిగా చీర పైకెత్తింది. మోకాళ్లకి పైన తొడలకు కింద తెల్లగా ఉన్న మచ్చని చూపించింది. ఏమనాలో ఏంచేయాలో అర్ధం కాలేదు నాకూ, మా కెమేరామాన్ కి. ఇద్దరం ఒకళ్ల మొహాలు ఒకళ్లం చూసుకున్నాం. వీణ చీరను కిందకు లాగింది. హమ్మయ్య అనుకున్నాం.) తర్వాత రోజు మధ్యాహ్నం వరకూ నరకం చూపించారు ఇద్దరూ. తర్వాత తెలిసింది వాళ్లిద్దరూ ఫ్రెండ్సని. ఒళ్లంతా నొప్పులతో ఆరోజంతా అలాగే పడున్నాను. కనీసం బాత్రూంకి కూడా వెళ్లలేకపోయాను. ఒకడు బయటికెళ్లి తినటానికి బిర్యానీ, మందు తెచ్చుకున్నారు. దాహంగా ఉందనేసరికి నానోట్లో ఆ మందే పోశారు. అదే మొదటిసారి నేను మందు తాగటం. తర్వాత అలాగే పడి నిద్ర పోయాను. మళ్లీ రాత్రి ఇద్దరూ మొదలు పెట్టారు. ఈసారి చేతులకి కట్లు ఊడదీశారు. కానీ నాలో ఓపిక లేదు. ఒక రోజంతా బట్టలు లేకుండా ఉన్నచోటినుంచి కదలకుండా రొచ్చులో పడిఉన్నాను. ఐనా ఆ పందులకి ఏమీ జాలిలేదు. ఒకడితర్వాత ఒకడు వాళ్ల పని కానిచ్చుకున్నారు. బావైతే 'అక్కడ ' కాల్చాడు. సిగరెట్తో వెంట్రుకలు కాల్చి ఆ వాసన పీలుస్తూ నా ఒళ్లంతా కొరికాడు. నేను ఏడుస్తుంటే వాళ్లు నవ్వుతున్నారు. ఇలా ఎంతసేపు చేశారో తెలియదు. లేచిచూసేసరికి తర్వాత రోజు మధ్యాహ్నం అయింది. ఒంట్లో ఓపిక లేదు. ఇంట్లో వాళ్లు కూడా లేరు. ముందురోజు వాళ్లు తెచ్చుకున్న బిర్యానీ కొంచెం మిగిలి ఉంటే అదే తినేసాను. తర్వాత రెండు రోజులు మోషన్స్ అయ్యాయనుకో.. అది వేరే సంగతి. బాత్రూంకెళ్లి మొత్తం కడుక్కున్నాను. కాళ్ల నిండ అట్టలు కట్టిపోయి ఉంది ఇద్దరిదీ. గంట సేపు ఏడ్చాను అక్కడే. మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకుని ఆ కుక్కలని వదలకూడదని నిర్ణయించుకున్నాను. కానీ అప్పుడు మాత్రం అక్కకి అసలు విషయం చెప్పాలని అనుకున్నాను. విజయవాడ వచ్చేశాను. ఏడుస్తూ జరిగింది చెప్పాను. అప్పుడే తెలిసింది అక్కకి రోజూ నరకమేనని, తన ఒళ్లంతా సిగరెట్ వాతలూ, బ్లేడు గాట్లేనని. ఆ రోజు రాత్రే వాళ్లిద్దరూ విజయవాడ ఇంటికి వచ్చారు. ఇద్దరూ బాగా తాగి ఉన్నారు. నేను వంట గదిలోనే దాక్కున్నాను. ఇక లాభంలేదని ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. వాళ్లిద్దరూ పడుకున్నాక ఇద్దరం కలిసి వాళ్లని చంపేద్దామనుకున్నాం. వాళ్లు పడుకున్నాక ఇద్దరం రోకలిబండ, గునపంతో వాళ్ల తలలు పగలకొట్టాం. అక్క మొగుడు చచ్చాడు. (నవ్వుతూ..) ఇంకొకడిది మాత్రం పగిలిపోయింది. తర్వాత ఇద్దర్నీ పోలీసులు అరెస్టు చేసారు. ఐదేళ్లు జైళ్లో ఉన్నాం. అంతా ఆడాళ్లే అయినా ఒక్కోటి బాగా బలిసి ఉండేదిలే. అక్కడ ఇంకోరకం అనుభవం. బయటకి వచ్చిన తర్వాత బతకటమంటేనే భయమేసింది. జైళ్లో పరిచయం ఐన ఒకావిడ ఇక్కడ బిజినెస్ చేస్తుంది. తనవాళ్ల అడ్రస్ ఇచ్చి కలవమంది. మాకు కూడా జీవితం మీద ఆశలేమీ లేవు. ఏదైతే ఏంటి బతకటానికి? ఇలాగే బతకాలా.. సిగ్గులేకుండా అంటే.. ఏమో! మా జీవితాలు మాకు లేకుండా చేశారు. దానికేం చెప్తారు మమ్మల్ని అడిగేవాళ్లు? కానీ మేము మమ్మల్ని అమ్ముకుంటున్నా, ఎంతో కొంత మిగిలిన వాళ్లకి ఉపయోగపడుతున్నాం తెలుసా? నేను ఇద్దర్ని చదివిస్తున్నాను. మా అక్క ముగ్గుర్ని చదివిస్తుంది. ఏమో, వాళ్లు ఐదుగురు మమ్మల్ని చూసుకోకపోయినా పర్లేదు. వాళ్లు సంతోషంగా ఉంటే చాలు. (తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అప్పుడు. మాట కూడా తడబడుతోంది.).
అప్పటికే వీణ కూడా ఏడుస్తున్నట్లే ఉంది.
తర్వాత కళ్లు తుడుచుకుని అంది.. "నేనే వాళ్ల అక్కని" అని.
వీణ: తనని హైదరాబాదు పంపించేటప్పుడే నాకు అనుమానం వచ్చినా, ఏమో తనైనా బాగుండచ్చు కదా అనుకున్నాను. అప్పుడు వాడి దుర్మార్గం తెలియలేదు. తర్వాత తెలిసేసరికే అంతా అయిపోయింది. పెళ్లయిన దగ్గర్నుంచి నరకం చూపించాడు వాడు. అందుకే చంపేయాలనుకున్నాను. లేకపోతే ఆ లం*కొడుకు నా చెల్లి జీవితాన్ని నాశనంచేస్తాడా వాడు? (ఆవేశంతో ఏడుస్తుంది తను. ఈసారి ఈమెని కంట్రోల్ చేయటం కష్టం అయింది మాకు.) మా జీవితం మాచేతుల్లోంచి ఎప్పుడో లాగేసుకున్నారు అంతా కలిసి. కనీసం వేరే పిల్లల జీవితాన్నైనా బాగు చేద్దామనుకున్నాం. ఇంతకంటే చెప్పటానికి మా దగ్గరేం లేదు.
అప్పుడు మాత్రం మనస్పూర్తిగా వాళ్లకు దణ్ణం పెట్టాం, నేను మా కెమేరామాన్ కలిసి.
In this part, i tried to explore the characters of those women, i saw and talked to. But, in the next time i wish to share how they changed my Life.
Thank you!