విధాత మనుషుల తలరాతలను రాస్తున్న సమయంలో "నాధా, ఓసారి ఇలా రారూ.." అని మాత పిలిచింది. సరే, పాపం ఆమెకేం ఇబ్బంది వచ్చిందోనని ఆయన అలా.. వెళ్లారు. ఎన్నో ఏళ్ల తర్వాత దొరికిన అవకాశం అనుకుని ప్రొడక్షన్ టీమ్‌లోని వాళ్లు చిన్న కునుకేశారు. అంతే.. విధాత తిరిగొచ్చేలోగా ఓ పొరపాటు జరిగిపోయింది. మాన్యుఫాక్చరింగ్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ వాళ్లకు డెలివరీ చేసిన లాట్లోంచి ఓ మనిషి తప్పించుకున్నాడు. దాన్ని కవర్ చేసుకునేందుకు పక్క బ్యాచ్‌లోంచి ఒకడిని సర్దుతూ పోయారు. దీంతో.. ఒకడి తలరాతలు మరొకడి నుదిటిమీద రాసేశాడు విధాత.
---------------------
అప్పుడు QCలో తప్పించుకున్న వాడు డిస్పాచ్ సెక్షన్లోకి చొరబడి మిగతావాళ్లతో పాటు లైన్లో నుంచున్నాడు. నుదుటి మీద గీతలు లేకపోతే తనను మిగతావాళ్లు గుర్తుపట్టేస్తారేమో అనే భయంతో ఉన్న అతడిని కాపలావాళ్లు చూడనే చూశారు. పక్కకు లాగాలాని ట్రై చేస్తే ఇంచు కూడా కదలడు. చివరకు ఓ భటుడికి కోపం వచ్చి ముక్కు మీద గుద్దాడు. అంతే.. లేత ముక్కు కదా ఊడిపోయింది.
--------------------
చివరకు ఎలాగైతేనేం.. అతడిని తీసుకెళ్లి తలరాత క్యూలో నుంచోబెట్టారు. ముక్కు ఊడిపోయి మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్న అతడిని భూమి మీదకు పంపవద్దన్నాడు విదాత. మా తప్పేమీ లేదు, డిస్పాచ్ వాళ్లు సరిగా హ్యాండిల్ చేయలేదు కాబట్టే ముక్కు ఊడిపోయింది అన్నారు మాన్యుఫాక్చరింగ్ డిపార్ట్మెంట్ వాళ్లు. క్వాలిటీ కంట్రోల్ వాళ్లు చేసిన పొరపాటే అతడి తప్పించుకోవటానికి కారణం అన్నారు డిస్పాచ్ వాళ్లు. తలరాతకు ముందే తప్పించుకునే తెలివినిచ్చిన మాన్యుఫాక్చరింగ్ వాళ్లదే తప్పంతా అని వాదించారు QCవాళ్లు. దీంతో ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది. ఈలోపు మరి కొంత మంది అతనికి శిష్యులుగా చేరి ఆ తెలివితేటలు కొంచెం నేర్చుకున్నారు.
-------------------
జనాభాలో వేదభూమి ఇండియా, చైనాని బీట్ చేయలేదేమో అనుకున్న విధాత చివరకు దిగివచ్చాడు. పుట్టకముందే తగవులు పెట్టగలిగిన అతడిని ఎలాగైనా వదిలించుకుందామనుకున్నాడు. మాన్యుఫాక్చరింగ్ డిపార్ట్మెంట్ వాళ్లతో మాట్లాడి అతని ముక్కుకి అందరూ గుర్తుపట్టేలా అతుకేయించాడు. తలరాత రాసేటప్పుడు.. "అందరికీ తలలో నాలుకలా ఉండు" అంటూనే నాలుకకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే గుణాన్ని ఇచ్చాడు.
-------------------
తలరాత పూర్తవుతున్న సమయంలో అతనికి ఓ డౌట్ వచ్చింది. "జనాభా పెరిగితే భూమి కూడా పెరుగుతుందా?" అని విధాతని అడిగాడు. "భూమి ఎలా పెరుగుతుంది నాయనా?" అని అమాయకంగా ఆడిగాడు మ్యాన్మేకర్. "మరి జనం పెరిగితే భూమ్మీద ఇబ్బంది కదా?" అన్నాడు మనోడు. "అది చూసుకోవడానికి యమధర్మరాజున్నాడు నాయనా" అన్నాడు విధాత. "నీకప్పుడే ఇన్ని తెలివితేటలు వచ్చాయి, నన్నే ప్రశ్నించే రేంజికి ఎదిగావు కాబట్టి భూమి మీద నువ్వేం చేద్దామనుకుంటున్నావో చెప్పు.. అదే చేసేలా వరం ఇస్తాను.." అన్నాడు మేకర్. "సరే.. నువ్వంతగా అంటున్నావు కాబట్టి ఆ యమధర్మరాజు పోస్ట్ నాకే ఇవ్వు.." అన్నాడు. "అది కష్టం నాయనా! దేవేంద్రుడు ఊరుకోడు తర్వాత తన సీటడుగుతావని... కాకపోతే వరం ఇస్తానని నేనే అన్నాను కాబట్టి, యముడి అంశ కొంచెం నీకు ఇస్తాను. దాని ప్రభావంవల్ల, నాలుకనే ఆయుధంగా చేసుకుని కొంతమంది ప్రాణాలు అయినా తీసి సరదా తీర్చుకో" అన్నాడు విధాత.
--------------------
చివరకు అతను భూమ్మీద పడ్డాడు.. మేకింగ్ సమయంలో అతని దగ్గర తెలివితేటలు నేర్చుకున్నవారు ఇక్కడా అతని చుట్టూ చేరారు. ప్రస్తుతం విధాత ఇచ్చిన వరం ఉపయోగిస్తున్నారు.
తాళి
12 సంవత్సరాల క్రితం