20, ఫిబ్రవరి 2010, శనివారం

నాకు కావలిసొందొక్కటే..

అవును..
నాకు కావలసిందొక్కటే..

పదవులు వదలని
నేతల కన్నా..
మారని మా తలరాతల కన్నా..
నాకు కావలిసిందొక్కటే..

మాతృభూమి కోసం
మరో జీహాద్
చేస్తోన్న అన్నలు చెప్పినట్లు
నాకు కావలిసిందొక్కటే..

పక్కవాడి ప్రగతి
కన్నులమంటైన
మేధావుల మాట ప్రకారం
నాకు కావలిందొక్కటే..

కూలి పనికెళ్లి
ఫీజులు కడుతున్న
అమ్మ నాన్నల కన్నా..
నాకు కావలిసిందొక్కటే..


జీవితాలకే అర్పణ 
తర్పణలొదులుతున్న
విద్యార్థుల కోసం
నాకు కావలిసిందొక్కటే..


ఉద్యమాన్ని ఆరనీయక
ఊపిరిలూదేందుకు
ప్రాణం హారతినిచ్చే
నాకు కావలిసిందొక్కటే..

గాయాల బాధను
పంటికింద నొక్కిపెట్టి
నినాదాల మందునే మింగే
నాకు కావలసిందొక్కటే..

నా అన్నదమ్ముల
శాంతి సౌభాగ్యం..
అభివృద్ధి వాటా..
నాకు కావల్సిందొక్కటే!