బొమ్మలండి బొమ్మలు
ప్రాణమున్న బొమ్మలు
కులం కార్డు చూపిస్తూ
నోటికొచ్చినట్లు మాట్లాడే
మద బొమ్మలు
వెనక నుండి 'కీ' ఇస్తే
నచ్చనోళ్ళ వైపు వేలు చూపే
మర బొమ్మలు
మేం అంటాం, మీరు
పడండంటూ విర్ర వీగుతున్న
అద్దె బొమ్మలు
కర్ర చేత పట్టుకొచ్చి
కలం గొంతు నొక్కుతున్న
కీలు బొమ్మలు
అధికారం మాకుంది
అణగదొక్కుతామంటున్న
రాజ బొమ్మలు
చేలనుండి పారిపోయి
జనాన్ని చూసి నవ్వుతున్న
దిష్టి బొమ్మలు
తాళి
12 సంవత్సరాల క్రితం