1, జూన్ 2010, మంగళవారం

రండి.. 'స్టింగ్' చేద్దాం

డజను న్యూస్ ఛానళ్లలో
అరడజను వార్తలకు
డజనున్నర వ్యాఖ్యానాలు చూసే
ప్రేక్షకుడికి కాసింత వినోదం దొరికింది

ఎవడినైనా విఐపి చేసేందుకు
మైకులతో కొట్టుకునే మిత్రులు
ఒకరిని ఒకరు 'కుట్టుకునే'
పనిలో బిజీగా మారారివాళ

స్వాములు, సన్యాసులు, సన్నాసుల
చుట్టూ తిరిగి మోసపోయే
జనానికి కళ్ళు తెరిపించే ప్రయత్నం
'బ్రేక్' లేకుండా సాగుతోంది

మీడియాకు మీడియా
పరమ శతృవనే నిజం
టీఆర్పీల వేటలో నగ్నంగా
నిరూపిస్తోంది 'ఈ' జర్నలిజం

పసలేని వాదనలో
చివరికి ఎవరు ఓడినా
గెలిచేది మాత్రం భరిస్తున్న
ప్రేక్షక మహానుభావులు

అబ్బ.. తెలుగోళ్లకు మంచి
రోజులొచ్చాయి
మీడియాకు ముకుతాడు పడే
ముహూర్తాలు దొరికాయి

3 comments:

సుజాత వేల్పూరి చెప్పారు...

అబ్బ, సామాన్య ప్రేక్షకుడి ఆవేదనను ఎంత బాగా అక్షరీకరించారు నరేష్!అద్భుతం!

Ramu S చెప్పారు...

నరేష్...
తీరిక చేసుకుని బాగా రాసావు బ్రదర్. ఈ రోజు అంతా నేను చర్చను బాగా ఫాలో అయ్యాను.
రాము

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

సుజాత గారికీ, రాము గారికీ ధన్యవాదాలు.
డిస్కషన్ జరుగుతున్న సమయంలో మన బ్లాగర్లంతా ఇదే భావాన్ని వ్యక్తం చేశారు.
అదేంటో..
నేను జాయినయేప్పుడు ఇంజనీరింగ్‌కి వాల్యూ ఉండేది. బయటకు వచ్చేసరికి బిఎస్సీ లెవెల్‌కు వచ్చేసింది. అఫ్‌కోర్స్ ఇప్పుడు బిఎ లెవెల్లో ఉందనుకోండి..
అలాగే మీడియాలో చేరేప్పుడు నాలుగైదు చానళ్ల కంటే లేవు. ఇప్పుడో.. లెక్కపెట్టటానికి చేతి వేళ్లు సరిపోవు. (కాలివేళ్లు లెక్కపెట్టచ్చు.. బట్, నా పొట్ట సహకరించదు.) మీడియా అంటే ప్రజల్లో గౌరవం కూడా తగ్గిపోయింది.


ఎంతైనా లెగ్గు మహిమ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి