16, మే 2010, ఆదివారం

మనిషివా.. జర్నలిస్టువా??

నా మిత్రుడు వెంకట్ ఉక్రోషానికి.. ఆక్రోశానికి ఎగసిన తరంగాలు ఇక్కడ!

http://uttaratarangalu.blogspot.com/2010/04/blog-post_21.html


ఆ తరంగాలను చల్లార్చి, కలుపుకుని పోయిన నా వాహిని... (కామెంట్ రూపంలో అక్కడ కూడా ఉంది)
కొద్దిగా.. సరి చేసి.


కార్పొ'రేటు' కంపెనీలో ఉంటుంది ప్రతిపనికీ ఓ రేటు
ఒకడిని మంచి వాణ్ని చేయాలన్నా..
ఎందుకూ పనికిరాని వాడిగా చిత్రించాలన్నా..
ఆఫ్ట్రాల్.. మన చేతిలో పని.

నయా బూతు సామ్రాజ్యంలో..
'ఛీర్స్' లీడర్లం మనం
ఆఫీసు చీకటి గదుల్లో వలువలే ఉండవు
ఇక మనకు విలువలెక్కడ?

ఎవడైనా నోటుతో కొడితే చాలు..
అబ్బనీ తియ్యనీ దెబ్బ అంటూ..
అమ్మాయిల ఒడిలో మత్తుగా చిందేస్తాం.
ఆపై ముమైత్‌ఖాన్‌కి అశ్లీలతపై పాఠాలు చెప్తాం..

ప్రెస్‌ అని అచ్చోసి తిరిగేస్తాం
రూల్సంటే మనకి పట్టవు..
డాక్యుమెంట్సు అసలుండవు..
కానిస్టేబుల్ ఆపితే.. వాడి బాసుతో తిట్టిస్తాం.

ముచ్చటపడి ఎప్పుడైనా ముసుగు తీసి
మంచి చేయాలని ముందుకొస్తే..
'నీకెందుకొచ్చిన తీట?' అంటూ
తిట్టే మన బాసుల ముందు నవ్వుతూ చస్తాం.

డబ్బుకు.. అధికారానికి మధ్య
సరసాలకు సరదాలకు నడుమ
కంపులో బతికే పేడపురుగులం
బయట పడలేని.. శ్లేష్మంలో ఈగలం

ఎంతైనా మనం జర్నలిస్టులం!

7 comments:

Ramu S చెప్పారు...

ఏమిటండీ...మరీ యింతగా వుతికేసారు? నగ్న సత్యాలు.
చీర్స్
రాము
apmediakaburlu.blogspot.com

నేస్తం చెప్పారు...

ఇంత ఆవేశం మీలో ఉందా :) చాలా బాగా రాసారు.. ఈ మద్య పోస్ట్లు తక్కువగా న్నాయేం..బిజీనా :)

ఆ.సౌమ్య చెప్పారు...

అయ్యబాబోయ్, ఉతికేసారుగా!

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

ఆవేశం అందరిలో ఉంటుంది నేస్తం..
కాకపోతే ఎప్పుడో గానీ బయటకు రాదు.
కొద్దిగా బిజీగా ఉండటంతో కొత్త పోస్ట్‌లు రాయటం లేదు.

సౌమ్య గారూ..
ఇది ఉతికేయటం కాదండీ.. మా అసహాయతను అలా బయట పెట్టాను. అంతే.
ధన్యవాదాలు.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

నగ్న సత్యాలు.

Unknown చెప్పారు...

నరేష్ నందం (Naresh Nandam) గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

అజ్ఞాత చెప్పారు...

please visit godsavemedia.wordpress.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి