ఒక స్త్రీలో రెండు పర్వతాలుంటాయి.
ఆ రెండు పర్వతాలలో
ఒకటి మంచు పర్వతం..
మరొకటి అగ్ని పర్వతం.
ఏ స్త్రీ అయినా ఒక పురుషుడిని
మనఃపూర్తిగా నమ్మి, అర్పించుకున్నప్పుడు
మంచు పర్వతం కరిగిపోతుంది.
కరిగి, కౌగిలిలో ఒదిగిపోయిన స్త్రీ..
ఆ పురుషుడిని అనురాగ జలంతో అభిషేకిస్తుంది.
కానీ,
అదే స్త్రీ, తను నమ్మిన వాడు తనను మోసం
చేశాడని తెలుసుకున్న మరుక్షణం
అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఆ కోపాగ్ని
జ్వాలలతో అతన్ని దహించి వెస్తుంది.
వినాశనం సృష్టిస్తుంది.
ఆ లావాను చల్లార్చేందుకు స్త్రీ మనసులో
మంచు మిగిలి ఉండదు. మిగిలింది కన్నీరే.
ఆ ఉప్పునీటికి అగ్ని జ్వాలలు మరింత
భయంకరంగా ప్రజ్వరిల్లుతాయి.
నేను - మెడికల్ షాపు- ఓ కోతి
2 సంవత్సరాల క్రితం
2 comments:
బాగా రాశారు.
ఊరుమారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మరలిరాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతేలేదు
అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీజాతికొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్నీ పెరవారికొసగి
చీకటులలోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు వాడేది తనువే
మగవానికేమో ఒకనాటి సుఖమూ
కులకాంతకదియే కలకాల ధనమూ
తనవాడు వీడా అపవాదు తోడా
పదినెలలమోతా చురకత్తి కోతా
సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష --ఆరుద్ర
వివాహేతర సంబంధాలు ఇస్లాంలో హరాం.జిహాద్ అంటే ధర్మ యుద్ధం.ఇటువంటివన్నీ నీచమైన పాపాలే.నేరం ఏమతస్తుడు చేసినా నేరమే.జిహాదులు చేసే వాళ్ళంతా హంతకులు.మానవత్వం లేని రాక్షసులు.నేను వీళ్లను నమ్మను.మానవత్వమే అన్ని మతాలకంటే మంచి మతం.
మహానుభావుడు గురజాడ పలికిన మాటలు చూడండిః
"మతములన్నియు మాసిపోవును
జ్నానమొక్కటె నిలిచివెలుగును
ఎల్లలోకములొక్క ఇల్లై
వర్ణబేధములెల్ల కల్లై
ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును
ప్రేమనిలిపిన ప్రేమ నిలుచును
బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు
ప్రీతిగూర్చునో వాడెధన్యుడు"
కామెంట్‌ను పోస్ట్ చేయండి