8, ఆగస్టు 2007, బుధవారం

ఆఫీసులో రోజుని సంతోషంగా మొదలుపెట్టుటకు ఒక మార్గము

ఆఫీసులో మీ రోజుని సంతోషంగా మొదలుపెట్టుటకు ఒక మార్గము:
1. మీ పి.సి.ఆన్ చేయండి.
2. అందులో ఒక కొత్త ఫైలు ఓపెన్ చేయండి.
3. దానికి "బాసు" అని పేరు పెట్టండి.
4. దానిని "డిలీట్" చేయండి.
5. అప్పుడు రీసైకిల్ బిన్ ను ఎంప్టీ చేయండి.
6. మీ కంప్యూటర్ అడుగుతుంది... "బాసు ని పూర్తిగా నాశనం చేయనా??" అని.
7. సంతోషంగా "యస్" అని నొక్కండి.
8. ఇంకేం మీ బాసుని నాశనం చేసిన ఆనందంలో మిగిలిన పని కానివ్వండి.
.
.
.
.
.
.
కాని అక్కడ మీ బాసు లేకుండ జాగ్రత్త పడండి.


ఇలా మీ బాసునే కాదు.. ఇంట్లో అత్తని, టైం కి రాని మీ కాబ్ డ్రైవర్ ని, ఎప్పుడు డబ్బులు అడిగే పక్క సీటు పరమేశాన్ని.. లేదా సొల్లు కబుర్లు చెప్పే నన్నైనా సరే డిలీట్ చేసి పారేయండి. ఆనందంగా మీ సమయాన్ని ఇంకొంచెం ఎక్కువ సంతోషంగా గడపండి.

4 comments:

అజ్ఞాత చెప్పారు...

బావున్నాయి మీ టెక్కు నిక్కులు.

బ్లాగర్లను సంతోషంగా వుంచే ఉపాయాలు కూడా చెప్పండి

-- విహారి

రానారె చెప్పారు...

బాగుంది గానీ, మీ బ్లాగు ఉపశీర్షికే కొంచెం బరువుగా ఉంది.

అజ్ఞాత చెప్పారు...

బాగు బాగు మీ బ్లాగు!

aravind చెప్పారు...

నవ్వుకున్నాను మరొక్కసరి మనసారా......

కామెంట్‌ను పోస్ట్ చేయండి